మహిళ అక్షరాస్యత | Women's Education మహిళా అక్షరాస్యత ఆవశ్యకత | Importance of Women's Education
అక్షరాస్యత ప్రాముఖ్యత వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది. విద్య భావ ప్రకటనా సామర్థ్యాన్నిస్తుంది. స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా స్త్రీ చైతన్యం ప్రారంభమైంది. అందులో ప్రధానమైన అంశం స్త్రీ విద్య. స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్య్రం కూడా కావాలి అని గుర్తించారు. అందుకు విద్య అవసరం అని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తోంది. సామాజిక ఎదుగుదల వ్యక్తిగతమైన స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందటానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు, లోక జ్ఞానాన్ని విద్య అందిస్తుంది. స్త్రీకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది. కావున సమాజంలో అభివృద్ధి సాధించాలంటే స్త్రీకి విద్య తప్పకుండా అందించాలి. అప్పుడే సమాజంలో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. జ్ఞానం పెరుగుదల స్త్రీలు చదువుకోవడం వలన తమ కుటుంబాల్ని, పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకున్న స్త్రీలు పిల్లలకు పౌష్టికాహారం, టీకాలు వేయించటం, అంటురోగాల నిర్మలన, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ,అంటరాని తనం, మూఢనమ్మకాల...