ఎస్మా చట్టం ఏమిటి? ESMA in Telugu | Essential Services Maintenance Act (ESMA)
ప్ర : ఎస్మా' చట్టం ఏమిటి? దీనికి ఉన్న విస్తృతి ఎంత? దీన్ని ప్రయోగిస్తే ఏమవుతుంద? జ : ఏమిటీ 'ఎస్మా'? 'ఎస్మా' ( ESMA ) అనేది 'అత్యవసర సేవల నిర్వహణ చట్టం ( Essential Services Maintenance Act )' కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్ల వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా... కొన్ని రకాల 'అత్యవసర సేవల నిర్వహణ' అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరుకాకుండా.. ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె కడితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఎందుకొచ్చిందీ చట్టం? 1980ల్లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్ధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్ ముందు భారీఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్దఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని ...