జాతీయ బాలికా దినోత్సవం | National girl child day January 24
🌺జాతీయ బాలికా దినోత్సవం🌺
【జనవరి24】
'#వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి' అంటే స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. స్త్రీ లేకపోతే జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. అలాంటి ఈ సృష్టికి మూలం స్త్రీ.
మన దేశంలో ఆడపిల్లలను ధనలక్ష్మీగా భావిస్తారు. కూతురు(Daughter) పుట్టిందంటే చాలు సాక్షాత్తూ లక్ష్మీ దేవి తమ ఇంట అడుగుపెట్టిందని ఆనంద పడతారు.
ఏ ఇంట్లో అయినా కూతురంటే తల్లికి ప్రతిరూపం. ప్రతి ఒక్క తల్లి మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో.. కూతుర్ని కూడా అంతే ప్రేమతో చూసుకోవాలి. మన ఇళ్లలో ఎంత మంది మగపిల్లలు ఉన్నప్పటికీ.. ఒక్క కూతురు ఉంటే చాలు.. ఆ కళే వేరుగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల కోసం.. ప్రత్యేకంగా ఓ రోజంటూ ఏర్పాటు చేసుకుని, దాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిరోజూ ఆడవారిదే.. వారితో ఆనందం... ఇంటిల్లిపాది సంతోషం.
ఇల్లు కలకల్లాడాలంటే.. అమ్మాయి ఉండాల్సిందే. ఆమె చిరునవ్వులు.. ఆమె ఆటలు.. పాటలు.. సందడి.. అమ్మాయి ఇంట్లో ఆ ఆనందమే వేరు. కానీ.. కాలం మారుతున్నా ఇప్పటికీ చాలామంది కూతురిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. కొడుకు పుడితే గొప్పలా.. కూతురు పుడితే భారంలా ఆలోచిస్తున్నారు. అలాంటివారిలో మార్పు తెచ్చేందుకు........#జాతీయ బాలికా దినోత్సవం.
*#భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.*
ఆ రోజు 2008 లో ప్రారంభమైంది. దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దేశంలో ఆడపిల్లల పట్ల వివక్ష ను ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుకోవడం ముఖ్యోద్దేశమని అన్నారు. 2008 సంవత్సరం నుండి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బాలికా శిశు సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా బాలికల సాధికారత కోసం ప్రచారకార్యక్రమాలు కూడా ప్రారంభించబడ్డాయి. *మహిళలకు సాధికారత కల్పించడం కొరకు, 2015సంవత్సరంలో బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించబడింది.* ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో ప్రచారం చాలా విజయవంతమైంది. ఈ ప్రచారం ద్వారా బాలికలు మరియు మహిళలకు సంబంధించిన అనేక ముఖ్యమైన సమస్యలను కూడా లేవనెత్తారు. భ్రూహత్య కేసులు వంటి నేటి కాలంలో మహిళలపై అనేక అమానుష చర్యలు జరిగాయి. ఇలాంటి ప్రచారాలు ప్రజల మైండ్ సెట్ ను మార్చి, నేడు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇదే ప్రాతిపదిక.
#బాలికల భద్రత, విద్య, లింగ నిష్పత్తి, ఆరోగ్యం వంటి అంశాలను ఈ రోజుమాత్రమే కాకుండా ప్రతి రోజు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బాలికలకు కూడా సమాన హక్కులు కల్పించాలి. ఎవరికో ఏం కావాలో అది చేసే స్వేచ్ఛ వారికి ఉండాలి. నేడు జాతీయ బాలికా దినోత్సవాన్ని అందరూ అభినందించాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరూ బాలికలను గౌరవించి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని ప్రమాణం చేయాలి.
తల్లిలా, చెల్లిలా.. నాన్నకు నీడలా, అమ్మకు తోడుగా ఉంటూ ముద్దులొలికే చిట్టితల్లికి ప్రేమను పంచడమే కాదు, ఆడబిడ్డను పుట్టగానే చిదిమేసే.. ఈ లోకానికి ఆమెలేని లోకం లేదని చెప్పడమే ఈ రోజు ప్రత్యేకం. ఆడ బిడ్డ గొప్పతనాన్ని చాటే ప్రత్యేకమైన ఈ రోజు జాతీయ బాలికా దినోత్సవం
కూతుర్ల కోసం ప్రత్యేకమైన రోజు: మదర్స్ డే, ఫాదర్స్ డేలను జరుపుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ సృష్టికి మూలమైన అమ్మజాతి ఆణిముత్యం ‘ఆడపిల్ల’ను కంటిపాపలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే.. కంటే కూతురినే కనాలని చాటి చెప్పే జాతీయ బాలికా దినోత్సవంను నిర్వహిస్తున్నారు.
ఈ సమాజంలో ఆడ పిల్లలంటే చిన్న చూపు ఉంది. ఆడ బిడ్డను భారంగా భావిస్తూ, మగ పిల్లలే పుట్టాలని కోరుకునేవారు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. అలాంటి మూర్ఖుల్లో మార్పు తెచ్చి.. ఆడపిల్ల గొప్పతనాన్ని ఈ లోకానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ప్రభుత్వాలు.. ఆడ, మగ పిల్లలు సమానమే అని తెలియజెప్పేందుకు ప్రత్యేకంగా జాతీయ బాలికా దినోత్సవంను నిర్వహిస్తున్నాయి.
కొన్ని #దేశాల్లో ఆడమగా అనే బేధం ఉండదు. ఆడ బిడ్డ పుట్టిన సరే కంటికి పాపలా చూసుకుంటారు. కూతురితో సంతోషంగా గడుపుతారు. ప్రత్యేకంగా జాతీయ బాలికా దినోత్సవం రోజున
తమ కుమార్తెను బయటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తారు. కొందరు బహుమతులు అందించి కూతురు కళ్లలో ఆనందాన్ని చూసి మురిసిపోతారు. తమ జీవితంలో ఆమె ఎంత ముఖ్యమైనదో తెలుపుతూ తల్లిదండ్రులు కూతుర్లకు భావోద్వేగ లేఖలు రాస్తారు. ‘అమ్మ’ కూడా.. ఒకప్పుడు కూతురేనని, ఆమె లేకపోతే ఈ జన్మ లేదని చెప్పే రోజు ఇది. మరి, మీ చిట్టితల్లితో ఆనందంగా గడపండి.
Comments
Post a Comment