Posts

Showing posts from February, 2022

జాతీయ సైన్స్ దినోత్సవం | National Science Day | సీవీ రామన్ జీవిత చరిత్ర CV RAMAN Biography in Telugu

🔷జాతీయ సైన్స్ దినోత్సవం National science day       February 28 🔷 రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).  జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డే గా పేర్కొంటారు. ప్రతి ఏడది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా పేరుగాంచిన సీవీ రామన్‌గా ( ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్) 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్...

జాతీయ సైన్స్ దినోత్సవం | National Science Day

అది1928వ సంవత్సరం,  ఫిబ్రవరి 28వ తేదీ ... భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేసిన పండుగరోజు.......  "ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని కూడ అంటారు.  ఈ వివరాల సమాహారం కూలంకషంగా.,..కె కె వి నాయుడు  ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ...

జాతీయ నూతన విద్యా విధానం - 2020 | New Education Policy -2020 (NEP - 2020)

🍁 * కొత్త విద్యా విధానం 2021 అంటే ఏమిటి *   పాఠశాలల్లో పాఠ్యేతర, వృత్తిపరమైన స్ట్రీమ్‌లు, అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానానికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, అకడమిక్ స్ట్రీమ్‌లు అలాగే కొనసాగుతాయి.  కొత్త విధానంతో వృత్తి విద్య 6వ తరగతి నుంచి శిక్షణతో ప్రారంభమవుతుంది.  5వ తరగతి వరకు మాతృభాషలో లేదా ప్రాంతీయంగా బోధన తప్పనిసరి.  అభ్యసన ఫలితాలను సాధించడం కోసం విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం కోసం సమగ్ర 360-డిగ్రీల ప్రోగ్రెస్ కార్డ్ ప్రవేశపెట్టబడింది. 🔵 * NEPని ఎవరు సృష్టించారు?  2020-21*    పాఠశాల నుంచి కళాశాల వరకు ఉద్యోగాల వరకు ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్ నిపుణుల బృందం నుంచి మంత్రిత్వ శాఖ సూచనలు తీసుకుంది. 🟣 * కొత్త విద్యా విధానంలోని ముఖ్యాంశాలు *  ▪️ మెడికల్ మరియు లా కాలేజీలు మినహా అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఒకే రెగ్యులేటర్ ద్వారా నిర్వహించబడతాయి. ▪️ ఎంఫిల్ రద్దు.   ▪️ అప్లికేషన్ మరియు నాలెడ్జ్ ఆధారిత బోర్డు పరీక్ష అమలు చేయబడింది. ▪️ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను ఒకే నిబంధనలు నిర్వహి...

“థామస్‌ అల్వా ఎడిసన్‌

🙏💡"ఇన్స్పిరేషనల్‌ స్టోరీ"  “థామస్‌ అల్వా ఎడిసన్‌” గారి  జయంతి సందర్భంగా💡🙏 #ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్‌ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్‌ నీకిమ్మంది మా టీచర్‌..’ అని చెప్పాడు. కవర్‌ చింపి ఆ ఉత్తరం చదివిన ఆ తల్లి కళ్ల నిండా నీళ్లు… కొడుకు వినడం కోసం దాన్ని మరోసారి బయటకు చదివింది. థామస్‌ అల్వా ఎడిసన్‌… ఆమెరికాకు చెందిన గొప్ప #ఆవిష్కర్త, పెద్ద #వ్యాపారవేత్త. అతని ఆవిష్కరణలు ఎంతో సంచలనం సృష్టించాయి.నైట్‌ లైట్లు, గ్రామఫోన్‌, సినిమా ప్రొజెక్టర్‌.. విప్లవం సృష్టించిన విద్యుత్‌ బల్బు. నిజంగా అతనో అద్భుత మేధావి. అతని ఆవిష్కరణల్లో కొన్ని ఉన్నవాటినే ఇంకా అభివృద్ధి పరచడమైతే, కొన్ని ఉద్దేశపూర్వకంగా కనుగొన్నవి. బల్బు, ప్రొజెక్టర్‌ ఆ కోవకు చెందినవే. #అమ్మకు ఉత్తరం: ఒకరోజు, పాఠశాల నుండి ఇంటికి వచ్చిన ఎడిసన్‌, వాళ్లమ్మకు ఓ లెటర్‌ ఇచ్చి, మా టీచర్‌ నీకిమ్మంది అని చెప్పాడు. ఆ తల్లి ఎంతో ఆత్రుతగా ఆ ఉత్తరం చదివింది. పూర్తవగానే అమ్మ కళ్లల్లో నీళ్లు. ఏముందమ్మా అందులో అన్న కొడుకు ప్రశ్నకు సమాధానంగా దాన్ని గట్టిగా చదివి వినిపించింది. ‘‘ మీ అబ్బాయి ఒక మేధావి. తనకు ఈ స్క...

కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు | Union Budget 2022 - 23 Highlights | Indian Budget 2021 - 23 | Center Budget 2022 - 23

Image
కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు – రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు – రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు – రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు – ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా – 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా – 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు – రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు – ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు – 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌ – 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌) – అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు – ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు – పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు – ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం – అమృత్‌ పథకానికి  – అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం – పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్...

భారత ఆర్థిక సర్వే 2021 - 22 | Indian Economic Survey 2021 - 22 in Telugu

Image
Economic Survey: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే? కేంద్ర బడ్జెట్‌ 2022-23 సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్‌ సమావేశాలకు తెర లేచింది. దీంతో బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌ లోక్‌సభ ముందుకు తెచ్చారు. ఈసారి ఆర్థిక సర్వే సింగిల్‌ వాల్యూమ్‌గా రానుంది. ఈ సర్వేలో కీలక అంశాల విషయానికి వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 9 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్యసభ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సర్వే బహిరంగపరచబడుతుంది. ఎంతో కీలకం..! బడ్జెట్‌-2022కు ముందు ఆర్థిక సర్వే ఎంతో కీలకంగా మారనుంది. ప్రతీ ఏడాది బడ్జెట్ సెషన్‌లో సమర్పించే ఆర్థిక సర్వే చాలా ముఖ్యమైనది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తుంది. ఆర్థిక సర్వే(Economic Survey 2021-22) ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు రెండు సంపుటాలుగా సమర్పిస్తారు. ఈ సారి మాత్రం ఒకే సంపుటిగా ఆర్థిక సర్...