భారత ఆర్థిక సర్వే 2021 - 22 | Indian Economic Survey 2021 - 22 in Telugu

Economic Survey: లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి ఎంతంటే?

కేంద్ర బడ్జెట్‌ 2022-23 సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్‌ సమావేశాలకు తెర లేచింది. దీంతో బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌ లోక్‌సభ ముందుకు తెచ్చారు. ఈసారి ఆర్థిక సర్వే సింగిల్‌ వాల్యూమ్‌గా రానుంది. ఈ సర్వేలో కీలక అంశాల విషయానికి వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాదాపు 9 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్యసభ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సర్వే బహిరంగపరచబడుతుంది.

ఎంతో కీలకం..!
బడ్జెట్‌-2022కు ముందు ఆర్థిక సర్వే ఎంతో కీలకంగా మారనుంది. ప్రతీ ఏడాది బడ్జెట్ సెషన్‌లో సమర్పించే ఆర్థిక సర్వే చాలా ముఖ్యమైనది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తుంది. ఆర్థిక సర్వే(Economic Survey 2021-22) ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు రెండు సంపుటాలుగా సమర్పిస్తారు. ఈ సారి మాత్రం ఒకే సంపుటిగా ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం FY22గాను జీడీపీ గ్రోత్‌ రేట్‌ 9.2 శాతం ఉంటుందని వెల్లడించింది. 


అవి కనిపించకపోవచ్చును...!
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారనే దానిపై పూర్తి వివరణ ఈసారి ఆర్థిక సర్వేలో కనిపించకపోవచ్చు. సాధారణంగా, ఆర్థిక సర్వేలో వారు రాబోయే అడ్డంకులు, వాటిని ఎదుర్కోవటానికి రోడ్‌మ్యాప్ గురించి పూర్తి వివరాలను ఇందులో ఉంటాయి. 

ఆర్థిక సర్వేలోని పలు కీలక అంశాలు..
► వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ గ్రోత్‌ రేట్‌ 8 నుంచి 8.5 శాతంగా ఉండనుంది.

► గత ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ గ్రోత్‌ రేట్‌ 9.2 శాతం.

► వ్యవసాయ రంగంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రోత్‌ రేట్‌ 3.9 శాతం.

► పారిశ్రామిక రంగ వృద్ధి రేట్‌ 11.8 శాతం.

► సర్వీస్‌ సెక్టార్‌ వృద్ధి రేట్‌ 8.2 శాతం 

► 2021-22లో భారత దేశ ఎగుమతులు 16.5 శాతం పెరుగుతాయని అంచనా.

► 2021-22లో దిగుమతులు 29.4 శాతం పెరుగుతాయని అంచనా

► భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల విజయవంతమైన వాతావరణ చర్యకు క్లైమేట్ ఫైనాన్స్ కీలకమని పేర్కొన్న సర్వే 

► అమెరికా, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.

► డిసెంబర్ 2021లోనే దేశంలో రూ.8.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగడంతో UPI ప్రధాన దశకు చేరుకుంది.

► చాలా రాష్ట్రాల్లో తగ్గిన పన్నుల నేపథ్యంలో కోవిడ్ తిరోగమనం తర్వాత గృహాల అమ్మకాలు ఊపందుకుంటాయని అంచనా

► దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయి.

► 2022-23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధంగా ఉంది.

► 2021 ఆర్థిక సంవత్సరంలో లోటు పెరిగినప్పటికీ.. 2021-22లో ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

► టీకాల సరఫరా, సరఫరా విభాగంలో అమలు చేసిన సంస్కరణలు 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని నిర్దేశిస్తాయి.

► ఎగుమతుల వృద్ధి బలంగా ఉండటం కూడా ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది.

► బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఐదు దేశాల జాబితా నుంచి అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది.

► వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించింది. 

ఆర్థిక సర్వే సూచనలు:-

► సాంకేతికతను ఉపయోగించి.. చిన్న కమతాల్లో ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.

► రైతులు వైవిధ్యమైన పంటలు పండించేలా చూడాలి. నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి.

► 2070 నాటికి భారత్ కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి(నెట్ జీరో) తీసుకురావాలంటే.. క్లైమెట్ ఫైనాన్స్​ను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యం.

Comments

Popular posts from this blog

ఎస్మా చట్టం ఏమిటి? ESMA in Telugu | Essential Services Maintenance Act (ESMA)